విద్యుదాఘాతంతో వివాహిత మృతి | Married Woman Died With Power Shock In PSR Nellore | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వివాహిత మృతి

Jul 12 2018 12:38 PM | Updated on Sep 18 2018 8:38 PM

Married Woman Died With Power Shock In PSR Nellore - Sakshi

చెల్లారి మాధురి మృతదేహం

తోటపల్లిగూడూరు: మంచినీటి బోరు వద్ద విద్యుదాఘాతానికి గురై ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని పోట్లపూడిలో మంగళవారం రాత్రి  చోటు చేసుకొంది. స్థానికుల కథ నం మేరకు.. మండలంలోని వరకవిపూడికి చెం దిన మాధురి (23)కి, ఇదే మండలం పోట్లపూడి దళితకాలనీకి చెందిన చెల్లారి బాలకృష్ణతో ఏడేళ్ల కిందట వివా హం అయింది. బాలకృష్ణ ఏసీబీ డీఎస్పీ కార్యాలయంలో హాంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. దంపతులకు ఐదేళ్లలోపు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం మాధురి మూడో నెల గర్భిణి. మంగళవారం రాత్రి మాధురి భోజనం అనంతరం చేతులు శుభ్రం చేసుకునేందుకు ఇంట్లో ఉన్న చేతిపంపు కొట్టేందుకు ప్రయత్నించగా పంపునకు విద్యుత్‌ సరఫరా జరిగి షాక్‌కు గురైంది. ఈ ప్రమాదంలో మాధురి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి, శవపంచనా మా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పుల్లారెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement