వివాహిత ఆత్మహత్య

Married Woman Commits Suicide In PSR Nellore - Sakshi

గూడూరు రూరల్‌: గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో నివాసం ఉంటున్న అల్లూరు సురేఖ(32) అనే వివాహిత గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న రూరల్‌ పోలీసులు శుక్రవారం ఉదయం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువులు పెద్ద ఎత్తున ఏరియా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు మనుబోలు మండలం చెర్లోపల్లికి చెందిన అల్లూరు సుబ్బయ్య, సురేఖలకు 16 ఏళ్ల క్రితం వివాహమైంది.

వీరికి స్వరూప, వినయ్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీవనోపాధి కోసం గత ఐదేళ్లుగా చెన్నూరులో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల మనుబోలు పోలీస్‌స్టేషన్‌లో కూడా భర్తపై సురేఖ ఫిర్యాదు చేయడంతో గ్రామస్తులు సర్దిచెప్పి పంపారు. మద్యానికి బానిసైన సుబ్బయ్య తమ కుమార్తెను తరచూ వేధిస్తుండేవాడని తల్లి సుశీలమ్మ కన్నీటిపర్యంతమైంది. భర్తే చంపి ఉంటాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.  ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ ఎం.బాబి తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top