వివాహిత ఆత్మహత్యాయత్నం | married Woman Commits Suicide Attempt in Visakhapatnam | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్యాయత్నం

Jan 10 2019 9:25 AM | Updated on Jan 10 2019 9:25 AM

married Woman Commits Suicide Attempt in Visakhapatnam - Sakshi

వసుంధరకు చికిత్స చేస్తున్న ఏరియా ఆస్పత్రి వైద్యురాలు సుధాశారద

విశాఖపట్నం, నర్సీపట్నం: భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. పట్టణానికి చెందిన   దుర్గాప్రసాద్‌  ఇదే గ్రామానికి చెందిన వసుంధర అనే యువతి ఏడేళ్లుగా ప్రేమించుకుని, ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. వీరి వివాహాన్ని దుర్గాప్రసాద్‌ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వీరిద్దురూ పట్టణంలోనే  వేరుగా కాపురం ఉంటున్నారు. కొంతకాలంగా వీరి  మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో  దుర్గా ప్రసాద్‌...భార్య వసుంధరను వేధింపులకు గురి చేస్తున్నాడు. భర్త వేధింపులు భరించలేక బుధవారం ఉదయం భర్త ఇంటి ముందే వసుంధర బ్లేడ్‌తో చేయికోసుకుంది. తీవ్రంగా రక్తస్రావం కావడంతో అపస్మారిక స్థితికి చేరుకుంది.

స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు సంఘన స్థలానికి వెళ్లి వసుంధరను ఏరియా ఆస్పత్రికి తరలించారు.  వసుంధర మాట్లాడుతూ దుర్గాప్రసాద్‌తో తనకు ఆరు నెలల క్రితం వివాహం జరిగిందని తెలిపింది. మూడు నెలల  గర్భాన్ని తన భర్త తీయించేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. కట్నం తీసుకురమ్మని భర్త నిత్యం వేధిస్తున్నానడని తెలిపింది. గర్భం పోవడంతో పాటు భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నం చేశానని  తెలిపింది. తనను వేధిస్తున్న భర్త దుర్గాప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. తన భర్తపై గతంలో  ఫిర్యాదు చేశానని అయినా పోలీసులు పట్టించుకోలేదని వసుంధర తెలిపింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని సీఐ సింహాద్రినాయుడు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement