వివాహిత అదృశ్యం | Married disappearance | Sakshi
Sakshi News home page

వివాహిత అదృశ్యం

May 3 2018 11:12 AM | Updated on Aug 21 2018 8:23 PM

Married disappearance - Sakshi

సంధ్య(ఫైల్‌)

పటాన్‌చెరు టౌన్‌: వివాహిత అదృశ్యమైన ఘటన అమీన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అమీన్‌పూర్‌ మండలం బీఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన నారాయణ, సంధ్య భార్యాభర్తలు. నారాయణ ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం నారాయణ సినిమాకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసే సరికి భార్య సంధ్య ఇంట్లో లేదు. తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద ఎంత వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో బుధవారం అమీన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement