స్కూల్‌ ఫీజు అడిగిందని కూతుర్ని..

Man Killed Six Year Old Daughter Due To Irritated Over Paying School Fees - Sakshi

సాక్షి, చండీగఢ్ : స్కూల్‌లో ఫీజు కట్టడానికి డబ్బులు అడిగిందని కన్న కూతురినే చంపేశాడో దుర్మార్గపు తండ్రి. ఈ దారుణ ఘటన హరియాణాలోని కురుక్షేత్ర సమీపంలోని దబ్‌ఖేరా గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దబ్‌ఖేరా గ్రామానికి చెందిన  జస్బీర్ సింగ్, అతడి భార్య హర్జీందర్ కౌర్, ఆరేళ్ల కుమార్తెతో కలసి నివసిస్తున్నారు. సింగ్ రోజువారి కూలిపనులకు వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కూతురు స్కూల్ ఫీజుకు సంబంధించి అతడిని డబ్బులు అడిగిన ప్రతిసారీ విసుక్కునేవాడు. ఈ క్రమంలో తాజాగా కుమార్తె స్కూల్ ఫీజుకు సంబంధించి గొడవ జరిగింది. దీంతో ఏకంగా కూతుర్ని గొంతు నులిమి చంపేశాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top