గుండెపోటుకు గురైన వ్యక్తి మృతి | Man Died By Heart Attack | Sakshi
Sakshi News home page

గుండెపోటుకు గురైన వ్యక్తి మృతి

May 12 2018 9:01 AM | Updated on May 12 2018 9:01 AM

Man Died By Heart Attack - Sakshi

మృతుడి బంధువులతో మాట్లాడుతున్న ఏసీపీ మహేందర్‌

మద్దూరు(హుస్నాబాద్‌) : బంధువుల ఫిర్యాదుతో పాస్‌ పుస్తకాలు ఆపారని మనస్తాపంతో గుండెపోటుకు గురైన లక్కపల్లికి చెందిన బొల్లం ఆరోగ్యం(50) చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. శుక్రవారం రైతుబంధు పథకంలో తన తండ్రి బొల్లం ఆనందం పాస్‌ బుక్‌ సమీప బంధువు ఫిర్యాదు మేరకే ఇవ్వడం లేదని అధికారులను ప్రశ్నించి బంధువుతో గొడవ పడ్డాడు. ఇంటికి వచ్చిన తర్వాత గుండెపోటుకు గురైన బొల్లం ఆరోగ్యం విషయం తెలిసిందే.

దీంతో చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ క్రమంలో మృతుడి బంధువులు ధర్నా నిర్వహిస్తామని వెళుతుండగా హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌ సర్ది చెప్పి హుస్నాబాద్‌ ఆర్డీఓ శంకర్‌ కుమార్‌తో మాట్లాడించారు. మృతుడి కుటుంబానికి పరిహారంపై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. టీపీసీసీ కార్యదర్శి గిరి కొండల్‌ రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement