భార్యపై అత్యాచారం జరిగిందన్నాడు.. కానీ | Man Arrested For False Complaint In Noida | Sakshi
Sakshi News home page

భార్యపై అత్యాచారం జరిగిందన్నాడు.. కానీ

Jul 4 2019 8:21 AM | Updated on Jul 4 2019 9:50 AM

Man Arrested For False Complaint In Noida - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తన భార్యపై దుండగులు అత్యాచారం జరిపి..

నోయిడా : పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తి అరెస్ట్‌ అయిన ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఫేస్‌ 2 పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇలహాబాస్‌ గ్రామానికి చెందిన నరేశ్‌ సింగ్‌ బుధవారం పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేశాడు. తన భార్యపై దుండగులు అత్యాచారం జరిపి, హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అదంతా నిజం కాదని గుర్తించారు. తప్పుడు ఫిర్యాదు చేసి పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు గాను అతన్ని అరెస్ట్‌ చేశారు.  

‘ఉదయం 5 గంటలకు మా ఎమర్జెన్సీ నెంబర్‌ 100 ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. అవతలి వ్యక్తి మాట్లాడుతూ తన భార్యపై దుండగులు అత్యాచారం చేసి, హత్య చేశారని తెలిపాడు. దీంతో ప్రత్యేక పోలీసు బృందంతో అతను చెప్పిన ప్రదేశానికి వెళ్లాం. తీరా అతని ఇంటికి వెళ్లాక అక్కడ అలాంటిదేమీ జరగలేదని.. అంతా సక్రమంగానే ఉందని గుర్తించాం. ఆ సమయంలో అతని భార్య కూడా అక్కడే ఉన్నారు. ఆమె క్షేమంగానే ఉన్నార’ ని ఓ పోలీసు అధికారి తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement