రాలేదంటే యాసిడ్‌ పోసి చంపేస్తా.. | Man Acid Threats to Married Woman In Hyderabad | Sakshi
Sakshi News home page

వివాహితకు బెదిరింపులు

Jan 11 2019 8:48 AM | Updated on Jan 11 2019 9:45 AM

Man Acid Threats to Married Woman In Hyderabad - Sakshi

తాను రమ్మన్నప్పుడు రాకున్నా.. ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోయినా యాసిడ్‌ పోసి చంపేయడమే కాకుండా

సాక్షి, హైదరాబాద్‌: తాను చెప్పినట్లు నడుచుకోకపోయినా.. తాను రమ్మన్నప్పుడు రాకున్నా.. ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోయినా యాసిడ్‌ పోసి చంపేయడమే కాకుండా మొత్తం కుటుంబాన్ని అంతు చేస్తానని వివాహితను బెదిరించిన యువకుడిపై బంజారాహిల్స్‌ పోలీసులు క్రిమిన ల్‌కేసు నమోదు చేశారు.

పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫిలింనగర్‌లోని వినాయకనగర్‌ బస్తీకి చెందిన వివాహిత(28) టైలర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన రాజు గత కొంతకాలంగా ఆమె షాపు వద్దకు వచ్చి వేధిపులకు పాల్పడుతున్నాడు. ఆమె వెంటపడటమేగాక, తన మాట వినకపోతే తన దగ్గరికి రాకపోతే యాసిడ్‌ పోసి చంపుతానని బెదిరించసాగాడు. రెండు రోజుల క్రితం ఆమె పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన రాజు ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించడమే కాకుండా తన బైక్‌పై ఎక్కాల్సిందిగా ఆదేశించాడు. దీన్ని గమనించిన ఆమె భర్త, తల్లి, అత్తతో పాటు స్థానికులు  ఏం చేస్తున్నావని ప్రశ్నించగా తన మాట వినకపోతే మీ అందరినీ చంపేస్తానంటూ హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement