ఎరక్కపోయిన పెళ్లి కొడుకు ఇరుక్కుపోయాడు | Malaysian Man Spends Night After Wedding | Sakshi
Sakshi News home page

పెళ్లయిన రాత్రే జైలుకు.. ఎందుకంటే..

Dec 12 2017 5:39 PM | Updated on Dec 12 2017 5:41 PM

Malaysian Man Spends Night After Wedding - Sakshi

కౌలాలంపూర్‌ : మలేషియాకు చెందిన ఓ వ్యక్తి సంతోషంగా పెళ్లి చేసుకున్నప్పటికీ అది ఎంతో సేపు నిలవలేదు. కాసేపట్లోనే పోలీసులు ఓ నిందితుడి కోసం అతడు పెళ్లి చేసుకున్న వేదిక వద్దకు రాగా పెళ్లి కొడుకు అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఫలితంగా చిర్రెత్తిపోయిన పోలీసులు అతడిని కూడా తీసుకెళ్లి రాత్రంతా జైలు గోడల మధ్య ఉంచారు. దాంతో పెళ్లి రోజే తన పరిస్థితి ఎందుకు ఇలా అయిందని ఆలోచించుకోవడం అతడి వంతైంది. వివరాల్లోకి వెళితే కౌలాలంపూర్‌లోని అలోర్‌ సెతార్‌ అనే ప్రాంతంలో 35 ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు.

అనంతరం ఓ హోటల్‌లో అతిధులందరికీ పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడు. అయితే, ఆ పెళ్లికి పలు కేసుల్లో నిందితుడైన వ్యక్తి కూడా వచ్చాడు. అతడికోసం పోలీసులు రాగా పెళ్లి కొడుకుతో సహా ఓ 40మంది పోలీసులను అడ్డుకొని అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరుగుతుండగా అదే అదనుగా భావించిన నేరగాడు వెంటనే వెనుక వైపు కిటికిలో నుంచి పారిపోయాడు. దీంతో పోలీసులు పెళ్లి కొడుకును అరెస్టు చేసి జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement