నిత్యానందకు ఊరట

Madurai Adheenam Relief to Nithyananda - Sakshi

మధురై: వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానందకు స్వల్ప ఊరట లభించింది. ‘మధురై ఆధీనం’లోకి ప్రవేశించేందుకు అనుమతిస్తూ మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే పీఠాధిపతిగా కాకుండా కేవలం సాధారణ భక్తుడిగానే నిత్యానందకు మఠంలోకి ప్రవేశం కల్పిస్తున్నట్లు బెంచ్‌ స్పష్టం చేసింది. 

ఇదిలా ఉంటే ప్రస్తుత పీఠాధిపతి నిత్యానందను మధురై ఆధీనంకు 293వ గురు మహా సన్నిధానంగా గతంలో నియమించారు. అయితే ఆ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు భక్తులు న్యాయస్థానంలో కేసు వేశారు. అది పెండింగ్‌లో ఉండగా.. తనను మఠంలోకి అనుమతించాలంటూ మద్రాస్‌ హైకోర్టును నిత్యానంద ఆశ్రయించారు. ఇప్పుడు పిటిషన్‌పై విచారణ పూర్తి కావటంతో మఠంలోకి అనుమతిస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే కింది కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున పిటిషనర్‌ను కేవలం సాధారణ పౌరుడిగా మాత్రమే అనుమతిస్తామని హైకోర్టు బెంచ్‌ వ్యాఖ్యానించింది. మఠానికి వెళ్లే ముందు నిర్వాహకులకు, పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదని నిత్యానందకు కోర్టు సూచించింది. అదే సమయంలో నిత్యానందకు రక్షణ కల్పించాలని పోలీసులకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

(నా భార్యను బంధించారు.. విడిపించండి)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top