హైదరాబాద్‌ జంట పేలుళ్లకు 11 ఏళ్లు

Lumbini Park Gokul Chat Blast Completed 11 Years - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : 41 మందిని బలితీసుకున్న హైదరాబాద్‌ జంట పేలుళ్ల ఘటనకు నేటితో పదకొండేళ్లు పూర్తయ్యాయి. 2007, ఆగస్టు 25న లుంబిని పార్కు, గోకుల్‌ చాట్‌లో సంభవించిన జంట పేలుళ్లు ఎన్నో కుటుంబాలను వీధిన పడేశాయి. నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, వంద మందికి పైగా గాయపడ్డారు.  ఈ పేలుళ్ల కేసుకు సంబంధించిన తుది తీర్పును ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు సోమవారం(ఆగస్టు 27) వెలువరించనుంది.

ప్రభుత్వమే ఆదుకోవాలి..
ఈ ఉగ్రదాడి జరిగి పదకొండేళ్లయినా బాధిత కుటుంబాలను మాత్రం వాటి ఛాయలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కోఠి గోకుల్‌ చాట్‌ వద్ద నివాళులర్పించిన బాధిత కుటుంబాలు.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నాయి. చికిత్స కోసం లక్షల్లో ఖర్చు చేస్తున్నామని... దీంతో ఆర్ధికంగా చితికిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top