ఎల్‌సీ తీసుకున్నా.. విద్యుత్‌ సరఫరా

linemen dead on electric poal - Sakshi

విద్యుత్‌ షాక్‌తో ఉద్యోగి మృతి

ఉద్దేశ్యపూర్వకంగా చంపారని కుటుంబ సభ్యుల ఆందోళన

సబ్‌స్టేషన్‌ ఆపరేటర్, ఏడీలపై గ్రామస్తుల దాడి

బాధితులకు రూ.10 లక్షలు, ఉద్యోగం ఇస్తానని డీఈఈ హామీ

రంగారెడ్డి, మంచాల(ఇబ్రహీంపట్నం): విద్యుత్‌ షాక్‌కు గురై న విద్యుత్‌ శాఖ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని జాపాల గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథ నం ప్రకారం..జపాల గ్రామానికి చెందిన మంతని కృష ్ణ(46) విద్యుత్‌ శాఖ కార్మికుడిగా గత 20 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. ఇటీవలే కృష్ణ ఉద్యోగం రెగ్యూల ర్‌ అయ్యింది. కాగా జాపాల గ్రామంలో వ్యవసా య పొలం వద్ద విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఫీజ్‌ పడి పోయింది. తిరిగి ఫీజ్‌ వేయడానికి కృష్ణ అక్కడకు చేరుకొని స్థానిక సబ్‌స్టేషన్‌ నుంచి ఎల్‌సీ తీసుకున్నాడు. ట్రాన్స్‌ఫార్మర్‌పై విద్యుత్‌ తీగలను సరిచేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్‌ సరఫరా జరిగింది. దీంతో విద్యుత్‌ షాక్‌ గురైన కృష్ణ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతుడికి భార్య యాద మ్మ, ఇద్దరు కుతూళ్లు, కుమారుడు ఉన్నారు.  

రాజును శిక్షించాలి..
సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌ రాజు కావాలనే ఎల్‌సీ ఇచ్చి విద్యుత్‌ సరఫరా చేసి కృష్ణ మృతికి కారణమయ్యాడని బంధువులు, కుటుంబ సభ్యులు సబ్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఉద్దేశ్యపూర్వకంగానే మృతికి కారణమయ్యాడని ఆరోపించారు. కృష్ణ మృతికి కారకుడైన రాజుపై చట ్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌ రాజుపై దాడి చేయడమే కాకుండా ఏడీ శ్యాంప్రసాద్‌పై గ్రామస్తులు కోపోద్రిక్తులై దాడికి పాల్పడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, మంచాల, యాచారం, ఆదిబట్ల పోలీసులు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విద్యుత్‌ శాఖ డీఈఈ శ్యాంప్రసాద్‌ మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరి హారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇసా ్తమని హామీ ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top