అందుకే సౌమ్యను చంపేశా: కృష్ణయ్య | krishnaiah admits that he killed soumya | Sakshi
Sakshi News home page

అందుకే సౌమ్యను చంపేశా: కృష్ణయ్య

Oct 7 2017 11:51 AM | Updated on Nov 9 2018 4:36 PM

krishnaiah admits that he killed soumya - Sakshi

మిత్రుడితో సౌమ్య ఫొటో.. (ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ విద్యార్థిని సౌమ్యను హత్య చేసిన ఆమె బావ కృష్ణయ్య ఎట్టకేలకు నోరు విప్పినట్టు సమాచారం.  సౌమ్యను తానే హత్య చేసినట్టు కృష్ణయ్య అంగీకరించాడు. ఆమెను తాను పెళ్లి చేసుకోవాలనుకున్నానని, కానీ ఆమె ఇతరులతో చనువుగా ఉండటం నచ్చలేదని, అందుకే సౌమ్యను చంపేశానని కృష్ణయ్య పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.

సౌమ్యకు కృష్ణయ్య వరుసకు బావ అవుతాడు. సౌమ్యను అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని గతంలో కుటుంబసభ్యులు భావించినట్టు పోలీసులు తెలిపారు. అయితే, సౌమ్యతో కృష్ణయ్య వివాహ నిశ్చితార్థం అయినట్టు కథనాలు వచ్చాయి. ఈ కథనాలను పోలీసులు తోసిపుచ్చారు. సౌమ్యతో కృష్ణయ్యకు నిశ్చితార్థం కాలేదని, కానీ వరుసకు బంధువులు కావడంతో వీరు సన్నిహితంగా ఉండేవారని పోలీసులు తెలిపారు. ఇటీవల సౌమ్య ఇతరులతో చనువుగా ఉండటం కృష్ణయ్యలో అనుమానం పెంచిందని పోలీసులు అంటున్నారు. సౌమ్యనే పెళ్లి చేసుకోవాలనుకున్న కృష్ణయ్య.. ఆమె ఇతరులతో చనువుగా ఉండటం సహించలేకనే.. ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు చెప్తున్నారు.

పోలీసుల అదుపులో నిందితుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement