ఎర్ర చందనం స్మగ్లింగ్‌.. బీటెక్‌ విద్యార్థి అరెస్ట్‌ | In Kadapa District Forest Police Caught Red Sandalwood Smugglers | Sakshi
Sakshi News home page

ఎర్ర చందనం స్మగ్లింగ్‌.. బీటెక్‌ విద్యార్థి అరెస్ట్‌

May 7 2019 6:57 PM | Updated on May 7 2019 7:04 PM

In Kadapa District Forest Police Caught Red Sandalwood Smugglers - Sakshi

సాక్షి, కడప : రాజంపేట ఫారెస్ట్‌ డివిజన్‌ పరిధిలోని రోల్లమడుగు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్‌ అధికారులు మూడు రోజుల పాటు కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ 60 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అధికారులకు తారసడ్డారు. ఫారెస్ట్‌ పోలీసులను చూసిన స్మగ్లర్లు అధికారులపై దాడికి దిగారు. ఈ ఘటనలో పోలీసులు ఆరుగురు స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు. వీరిలో ఒక బీ టెక్‌ విద్యార్థి ఉండటం గమనార్హం. స్మగ్లింగ్‌ లాభసాటిగా ఉండటంతో చాలా మంది చదువుకున్న తమిళ యువత అడవుల బాట పడుతున్నట్లు ఫారెస్ట్‌ అధికారులు తెలిపారు. స్మగ్లర్ల నుంచి రూ. కోటి విలువ చేసే ఎర్రచందనం దుంగలతో పాటు 10 గొడ్డళ్లు, రంపాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement