‘నా భార్య ఉరి వేసుకుంది, రండి చూద్దాం' | Husband Killed Wife in YSR Kadapa | Sakshi
Sakshi News home page

భార్యను హతమార్చిన భర్త

May 20 2019 7:46 AM | Updated on May 20 2019 8:56 AM

Husband Killed Wife in YSR Kadapa - Sakshi

మృతి చెందిన రామానుజమ్మ, భార్యభర్త (ఫైల్‌)

కలిచివేసిన పాప ఏడుపులు

కడప, రాజంపేట : కట్టుకున్న భార్యనే గొంతునులిమి హతమార్చాడు భర్త. ఈ ఘటన రాజంపేట పట్టణంలో ప్రశాంత్‌నగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా.. పెనగలూరు మండలం ఎన్‌ఆర్‌పురానికి చెందిన ముండే రామానుజమ్మ(27), రైల్వేకోడూరు మండలంలోని ఉప్పరపల్లెకు చెందిన శంకరయ్యకు రెండు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వీరిద్దరికి ఇది రెండవ వివాహం కావడం గమనార్హం. కాగా శంకరయ్యకు నెల్లూరు జిల్లా పొదలకూరులో మొదటి భార్య చనిపోవడంతో శంకరయ్య, జీవనో పాధి నిమిత్తం కువైట్‌లో ఉండి వచ్చిన రామానుజమ్మను (మొదటి భర్తను వదలివేసి) వివాహం చేసుకున్నాడు. శంకరయ్య, రామానుజమ్మల కాపు రం సజావుగా కొనసాగింది. ఐదునెలల పాప కూడా ఉంది. అయితే ఏం జరిగిందో తెలియదు. ఆదివారం ఒక్కసారిగా శంకరయ్య కిందకు వచ్చి ‘‘నా భార్య ఉరి వేసుకుంది, రండి చూద్దాం అని మృతురాలి గ్రామస్తుడు, కింది అంతస్తులో నివాసం ఉంటున్న పెంచలయ్యను పైకి తీసుకెళ్లాడు. అప్పటికే మృతురాలిని కిందికి దించి ఉన్నాడు. ఆటో తీసుకొని వస్తా అని చెప్పి’’ శంకరయ్య పరారీ అయ్యాడు. అయితే స్థానికులు ఈ మృతిని అనుమానాస్పదంగా భావించారు.

హత్యకేసుగా నమోదు
రామానుజమ్మ ఇంటిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని స్ధానికుల నుంచి పోలీసులకు సమాచారం చేరింది. పట్టణ ఎస్‌ఐ హనుమంతు రామానుజమ్మ మృతికి గల కారణాలపై దృష్టి సారించారు. భార్యను భర్త గొంతు నులిపి హత్య చేశాడనే విధంగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు. శంకరయ్య పరారీలో ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా హాస్పిటల్‌కు తరలించామని వివరించారు.

కలిచివేసిన పాప ఏడుపులు
రామానుజమ్మ మృతి చెందడంతో ఆమె బిడ్డ ఏడుపులు ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేశాయి. చుట్టుపక్కల వారు ఓదార్చడానికి ప్రయత్నంచినా సాధ్యంకాలేదు. తల్లి తనకు ఎక్కడ దూరమైందో అనే విధంగా చిన్నారి రోదన ప్రతి ఒక్కరికి కంటితడిపెట్టించింది.

Advertisement
 
Advertisement
Advertisement