ప్రాణం తీసిన అనుమానం | Husband Killed Wife | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన అనుమానం

Apr 3 2018 11:17 AM | Updated on Sep 29 2018 5:26 PM

Husband Killed Wife - Sakshi

నాగమణి మృతదేహం

నంద్యాల: అనుమానంతో భార్యను ఓ వ్యక్తి కడతేర్చాడు. ఈ ఘటన నంద్యాల పట్టణంలో చోటు చేసుకుంది. త్రీటౌన్‌ సీఐ దేవేంద్రకుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన లారీ డ్రైవర్‌ గంగాధర్‌కు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గ్రామానికి చెందిన నాగమణి(22)తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఉపాధి కోసం వీరు మూడేళ్లుగా నంద్యాల పట్టణంలోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్నారు. గంగాధర్‌ లారీ డ్రైవర్‌ కావడంతో ఎక్కువగా ఇంటికి దూరంగా ఉండేవాడు.

ఈ క్రమంలో తాగుడుకు బానిసైన అతను భార్యపై అనుమానం పెంచుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న నాగమణి తలపై కట్టతో బాదాడు. మరణించిందని తెలుసుకున్న తర్వాత అతను ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి పరారయ్యాడు. గమనించిన తల్లి సాలమ్మ.. నాగమణిని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు త్రీటౌన్‌ పోలీసులు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement