కీచక హెచ్‌ఎం రిమాండ్‌ | Head Master Nagabhushanam Remand in Assault Case Prakasam | Sakshi
Sakshi News home page

కీచక హెచ్‌ఎం రిమాండ్‌

Mar 6 2020 1:22 PM | Updated on Mar 6 2020 1:22 PM

Head Master Nagabhushanam Remand in Assault Case Prakasam - Sakshi

హెచ్‌ఎం నాగభూషణం

ప్రకాశం, చీరాల రూరల్‌: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన కీచక హెచ్‌ఎం జె.నాగభూషణాన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఈపురుపాలెం ఎస్‌ఐ వి.సుధాకర్‌ గురువారం తెలిపారు. ఈపురుపాలెం పద్మనాభుని పేటలోని ఎంపీపీ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులతో ఆ పాఠశాలలో హెచ్‌ఎంగా విధులు నిర్వర్తిస్తున్న జె.నాగభూషణం కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడు. భయాందోళన చెందిన విద్యార్థినులు పాఠశాలలో జరుగుతున్న విషయాలను తమ తల్లిదండ్రులకు చెప్పుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వెళ్లి హెచ్‌ఎంను నిలదీసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement