అమానుష ఘటనపై సర్కారు సీరియస్‌

Government is serious about the atrocity in Eluru - Sakshi

ఏలూరులో గ్యాంగ్‌ రేప్‌ బాధితురాలిని పరామర్శించిన మహిళా కమిషన్‌ చైర్మన్‌

ఏలూరు టౌన్‌: ఏలూరులో సామూహిక లైంగిక దాడికి గురై ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ బుధవారం పరామర్శించారు. మహిళా కమిషన్‌ డైరెక్టర్‌ ఆర్‌.సూయిజ్‌తో కలిసి ఘటనపై బాధితురాలి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ అమానుష ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించి తీరుతామని ఆమె స్పష్టం చేశారు.

నిందితులను తక్షణమే అరెస్ట్‌ చేయాలని ఆదేశించారు. కాగా, మహిళలను రోడ్లపైకి తీసుకొచ్చి అమరావతి వీధుల్లో ధర్నాలు చేయించడమే పౌరుషమా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. బుధవారం ఏలూరులో ఆమె మాట్లాడుతూ రాజధాని అంశంపై చంద్రబాబు తీరును తూర్పారబట్టారు. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top