బాలిక అపహరణకు యత్నం

Girl Child Kidnap Attempt in Chittoor - Sakshi

తల్లిదండ్రులకు వెంబడించడంతో బాలికను వదిలేసి పరారైన ఆగంతకుడు

అర్ధరాత్రి తానిగిల్లు గిరిజన కాలనీలో కలకలం

బుచ్చినాయుడుకండ్రిగ : ఇంటి ముందు ఆరుబయట తల్లిదండ్రుల పక్కన పడుకుని నిద్రిస్తున్న బాలికను అర్ధరాత్రి అపహరణకు యత్నించిన సంఘటన మండలంలోని తానిగిల్లు గిరిజన కాలనీలో చోటు చేసుకుంది. తల్లిదండ్రుల కథనం.. తానిగిల్లుకు చెందిన మానికల వెంకటమ్మ, నాగరాజుల కుమార్తె వైష్ణవి (10) స్థానిక ప్రాథమిక పాఠశాల్లో 4 వ తరగతి చదువుతోంది. వేసవికాలం కావడంతో తల్లిదండ్రులతో కలసి  సోమవారం రాత్రి ఇంటి ముందు ఆరుబయట పడుకుంది.

తల్లి పక్కన నిద్రిస్తున్న వైష్ణవిని అర్ధరాత్రి అనంతరం ఓ ఆగంతకుడు  భుజాలపై వేసుకుని ఎత్తుకెళ్లాడు. వెంకటమ్మకు అకస్మాత్తుగా మెలకువ రావడం..కుమార్తె వైష్ణవి కనిపించకపోవడంతో ఆందోళన చెందింది. గమనించేసరికి తన కుమార్తెను ఎత్తుకుపోతున్న ఆగంతకుడిని గమనించి కేకలు వేసింది. దీంతో  కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగువారు అతడిని వెంబడించారు. దీంతో ఆగంతకుడు పాపను తీసుకుపోవడం కుదరని గ్రహిం చి, వదిలిపెట్టి, చీకట్లో పరారయ్యాడు. మంగళవా రం వైష్ణవి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఏఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top