చిన్నారిని చిదిమేసిన వాహనం | Girl Child Died in Road Accident Prakasam | Sakshi
Sakshi News home page

చిన్నారిని చిదిమేసిన వాహనం

Feb 5 2020 11:15 AM | Updated on Feb 5 2020 11:15 AM

Girl Child Died in Road Accident Prakasam - Sakshi

చిన్నారి మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి

దర్శి: గుర్తు తెలియని వాహనం ఢీకొని జిల్లాకు చెందిన రెండేళ్ల బాలిక ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు.. నూజెండ్ల మండలం బుర్రిపాలేనికి చెందిన పందుల బాబురావు, రూతమ్మ ప్రకాశంలో జిల్లాలోని తూర్పు వీరాయపాలెంలోని రూతమ్మ తల్లిదండ్రుల ఇంటికి వచ్చారు. వారి కుమార్తె కీర్తన(2) ఇంట్లో ఆటలాడుకుంటూ రోడ్డుపైకి వచ్చింది. ఈ సమయంలో గుర్తు తెలియని వాహనం బాలికను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ప్రమాదంలో తల రోడ్డుకు గుద్దుకోవడంతో బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. 108కు ఫోన్‌ చేయగా వారు అక్కడికి చేరుకుని పరిశీలించి కీర్తన మృతి చెందినట్లు నిర్ధారించారు.

Advertisement
 
Advertisement
Advertisement