వాట్సాప్‌ ద్వారా దందా: భారీ సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు 

 Ghaziabad Prostitution Racket Busted After Raids On Spa Centres,19 Arrested - Sakshi

ఉత్తరప్రదేశ్‌, ఘజియాబాద్‌లో  భారీ  సెక్స్‌రాకెట్‌

మూడు స్పాలపై పోలీసుల దాడులు

9 మంది అమ్మాయిలు సహా 19 మంది అరెస్ట్  

స్పా ముసుగులో యువతులను వ్యభిచార కార్యక్రమాల్లోకి దింపుతున్న వ్యవహారం ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్లో అమ్మాయిల ఫోటోలు పంపి, వారిని ఆకర్షించి, వ్యభిచార దందా సాగిస్తున్న ఉదంతాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు చేధించారు.  వీరిలో ప్రధానంగా ఒక మహిళ  వుండటం  మరింత ఆందోళన రేపింది. 

వివరాల్లోకి వెళితే, ఘజియాబాద్ నగర పరిధిలోని రాజ్ హంస ప్లాజాలోని మూడు స్పా సెంటర్లలో సెక్స్రాకెట్ కొనసాగుతోందన్న సమాచారం ఆధారంగా  పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఇందిరాపురంలోని మూడు స్పాస్‌లపై జరిపిన దాడుల్లో  9 మంది యువతులు సహా, మొత్తం 19 మందిని అరెస్టు చేశారు. యువతుల ఫోటోల ద్వారా నగరంలోని విటులను స్పాలకు ఆహ్వానించి ఈ రాకెట్ నడుపుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.  ఓ మహిళ ఆధ్వర్యంలో ఈ దందాను నడిపిస్తున్నారని అసిస్టెంట్ పోలీసు సూపరింటెండెంట్ కేశవ్ కుమార్ వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న యువతుల నుంచి రూ. 16 వేలను, 24 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. స్పా సెంటర్లు నిర్వహిస్తున్న వారిలో కొందరు పరారీలో ఉన్నారని, మానవ అక్రమ రవాణా నివారణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top