ఉసురు తీసిన అప్పులు

Farmers Suicide In Nalgonda - Sakshi

ఆత్మకూర్‌.ఎస్‌ (సూర్యాపేట) : ఆరుగాలం శ్రమించి.. అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టినా చివరకు ఉత్తచేతులే మిగలడంతో ఆ రైతులు కలత చెందారు. ఓ వైపు పూటగడవని దైన్యం.. మరో వైపు అప్పులవారి ఒత్తిడికి తట్టుకోలేకపోయారు. ఇక చావే శరణ్యమనుకుని బలవన్మరణాలకు పా ల్పడ్డారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మం డలం రామన్నగూడెం ఆవాసం తెట్టేకుంట తండా కు చెందిన బాణోతు రాణ్య (50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.  నాలుగు సంవత్సరాలుగా ఏపూరు రైతుకు చెందిన పదెకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. సాగు పెట్టుబడులకు దాదాపు 4లక్షల రూపాయలు అప్పు చేశాడు. కాలం కలిసి రాక దిగుబడి ఆశాజనకంగా రాలేదు.

దీంతో ఈ సంవత్సరం కౌలు వదిలి కోటపహాడ్‌కు చెందిన ఒక రైతు వద్ద 80వేలకు జీతం కుదిరాడు. కాగా  అప్పుతీర్చే మార్గం కనిపించిక శనివారం 8గంటల సమయంలో పురుగుల తాగాడు.గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే లోపే మృతిచెందాడు. అతడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోస్టుమార్టం నిమి త్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతు డి కుమారుడు శ్యామ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ తొగరు సత్యనారాయణ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top