పుస్తకం కోసం వస్తే ముద్దిచ్చాడు! | Fancy Shop Man Kissed Girl In Tamilnadu | Sakshi
Sakshi News home page

పుస్తకం కోసం వస్తే ముద్దిచ్చాడు!

Aug 15 2019 7:03 AM | Updated on Aug 15 2019 8:01 AM

Fancy Shop Man Killed Girl In Tamilnadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చెన్నై: ఫ్యాన్సీ షాపులోకి పుస్తకం కొనేందుకు వచ్చిన విద్యార్థినిని వాటేసుకుని ముద్దిచ్చిన యువకుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రం త్రిచూర్‌ సమీపానగల సావక్కాడుకు చెందిన మునీర్‌ (35). ఇతనికి వివాహం కాలేదు. ఇతను కోయంబత్తూరు కారమడైలోగల ఒక ఫ్యాన్సీ స్టోర్‌లో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఈ దుకాణానికి అదే ప్రాంతంలోగల ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థిని ఆంగ్ల పుస్తకం కొనేందుకు వచ్చింది.

ఆ సమయంలో దుకాణంలో ఉన్న మునీర్‌ విద్యార్థినిని దుకాణం లోపలికి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత హఠాత్తుగా ఆమెను వాటేసుకుని ముద్దిచ్చాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన విద్యార్థిని అక్కడ్నుంచి తప్పించుకుంది. తర్వాత ఇంటికి వచ్చి తన తల్లితో చెప్పింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు కారమడై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం మునీర్‌ను అరెస్టు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement