కుందునదిలో దూకి కుటుంబం ఆత్మహత్య

Family Commits Suicide By Jumping Into Kundu River  - Sakshi

సాక్షి, కడప: వైఎస్సార్‌ జిల్లాలో విషాదం నెలకొంది.  కొల్లూరు వద్ద  కుందునదిలోకి దూకి ఓ కుటుంబం గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనలో భార్యా, భర్తతో పాటు కుమార్తె కూడా మృతి చెందింది.  మృతులు రాజుపాలెం మండలం గాదెగూడురుకు చెందిన  తిరుపతిరెడ్డి, వెంకట లక్ష‍్మమ్మ, ప్రవళికగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.

కాగా ప్రవళిక ప్రేమ వ్యవహారమే ఈ విషాదానికి కారణమని తెలుస్తోంది. చిన్న కుమార‍్తె ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో పాటు మనసు మార్చుకోవాలని సూచించారు. అయితే కుమార్తె ప్రవర్తనలో రాకపోవడంతో తిరుపతి రెడ్డి మనస్తాపం చెంది, భార్య, కుమార్తెతో ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top