కూతురు వేరే కులం వాడితో పారిపోయిందని.. | Elderly Couple Commits Suicide After Daughter Elopes With Man From Another Community | Sakshi
Sakshi News home page

Oct 14 2018 8:05 PM | Updated on Nov 6 2018 8:08 PM

Elderly Couple Commits Suicide After Daughter Elopes With Man From Another Community - Sakshi

కోయంబత్తూర్‌ : కూతురు తక్కువ కులం వాడితో పారిపోయిందని మనస్తాపం చెంది తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కోయంబత్తూర్ జిల్లలో పొల్లాచికి చెందిన ఓ వృద్ధ జంటకు ఏకైక కుమార్తె(24) కలదు. ఆమె తన కాలేజీలో ఓ అబ్బాయిని ప్రేమించింది. అతను వారి వర్గానికి చెందిన వ్యక్తి కాకపోవడంతో అతన్ని మరిపోవాలని తల్లిదండ్రులు ఆమెను బెదిరించారు. అయినప్పకి ఆమె అతనితో సంబంధాన్ని కొనసాగించింది. విషయంతో తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను మరోసారి బెదిరించారు. 

దీంతొ ఆమె ఆ ప్రేమించిన యువకుడితో పారిపోయింది. ఒక్కగానుఒక్క కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపం చెందారు. పరువు పోతుందని భావించి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తమ బంధువులకు ఫోన్‌ చేసి చెప్పి ఇద్దరు పురుగుల మందు తాగారు. బంధువులు ఇంటికి వచ్చి చూసే సరికి అపస్మారక స్థితిలో పడిఉన్నారు. వారిని వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి వారు మృతి చెందారని తెలిపారు. దీంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా ఈ విషయం వారి కూతురుకు తెలియలేదు. ఆమె ఫోన్‌ స్విచ్‌ఆప్‌ వస్తుందని బంధువులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement