క్లబ్‌ డ్యాన్సర్‌ బట్టలు విప్పి అసభ్యకరంగా..

Dancer attacked by girls in Lesban pub begumpet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  బేగంపేటలోని లెస్బెన్‌ పబ్‌లో శుక్రవారం రాత్రి ఓ డ్యాన్సర్‌పై దాడి జరిగింది. నడిరోడ్డుపై తనను వివస్త్రన చేసి, దాడికిపాల్పడ్డారని క్లబ్‌ డ్యాన్సర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకుంది. సినిమా చాన్స్‌ల కోసం హైదరాబాద్‌ వచ్చిన యువతి, ఆర్థిక సమస్యల కారణంగా లెస్బెన్‌ పబ్‌లో డాన్సర్‌గా పని చేస్తోంది. ఆ పబ్‌కొచ్చే కస్టమర్లు తాగిన మైకంలో తనతో అసభ్యంగా ప్రవర్తించేవారని, కోరిక తీర్చాలంటూ వేధించేవారని తెలిపింది. అవన్నీ పట్టించుకోకుండా తనపని తాను చేసుకుని వెళ్లిపోయేదాన్నని చెప్పింది. ఓ రాత్రి కస్టమర్‌తో గడిపితే రూ.10వేలు ఇస్తారని పబ్‌ నిర్వాహకులు ఒత్తిడి చేసేవారని క్లబ్‌ డ్యాన్సర్‌ వాపోయింది. 

'ఇటువంటి అసాంఘీక కార్యక్రమాలకు అంగీకరించలేదు. దీంతో వారంతా నాపై కక్ష్య కట్టారు. తరచూ ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడేవారు. పబ్‌లో బ్లేడ్‌లతో ఒళ్లంతా గాయాలు చేసే వారు. నిన్న క్లబ్ ముగిసిన తర్వాత ఒంటి గంటకు నలుగురు అమ్మాయిలు, మరోవ్యక్తితో కలిసి దాడి చేశారు. ఒంటిపై బట్టలు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించారు. వాళ్లకు ప్రముఖ రాజకీయ నాయకులు తెలుసంటూ బెదిరించారు. సయ్యద్ అనే వ్యక్తి వీళ్లందరికి బాస్. పంజాగుట్ట పీఎస్‌లో వారిపై ఫిర్యాదు చేశాను. నాపై దాడి చేసిన వారు కూడా పంజాగుట్ట పీఎస్‌కు వచ్చి వెళ్ళిపోయారు. క్లబ్‌లో ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు. సాయంత్రానికల్లా దాడి చేసిన వాళ్లందరిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు' అని క్లబ్‌ డ్యాన్సర్‌ పేర్కొంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top