రూ. 4 లక్షల విలువైన బంగారం స్వాధీనం

Cyberabad Police Arrest Chain Snatcher Gang - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సైబరాబాద్‌ పరిధిలో చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను శుక్రవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో ఒక మైనర్‌ బాలుడు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దుసుముక్క దస్తగిరి ఈ గ్యాంగ్‌కు లీడర్‌ అన్నారు. దొంగతనం చేసిన బైక్‌ల మీద తిరుగుతూ చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడటం ఈ గ్యాంగ్‌ ప్రత్యేకత అన్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్‌ చేసుకుని వీరు గొలుసు దొంగతనాలకు పాల్పడతారని తెలిపారు. వీరి మీద ఇప్పటికే ఐదు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 10 కేసులు నమోదు అయ్యాయన్నారు. నిందుతల దగ్గర నుంచి రూ. 4 లక్షల విలువ చేసే 86 గ్రాముల బంగారం.. 3 మోటర్‌ వెహికల్స్‌.. మూడు మొబైల్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top