
అప్పలరాములు మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
పూసపాటిరేగ: మండలంలోని కొప్పెర్ల విద్యుత్ సబ్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో విద్యుత్ శాఖ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే...తొత్తడాం గ్రామానికి చెందిన గొరుసు అప్పలరాములు (30) విద్యుత్ కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో గురుకుల పాఠశాల సమీపంలో విద్యుత్ స్తంభంపై అప్పలరాములు పనులు చేస్తున్నాడు. ఈ విషయం గ్రహించని కొప్పెర్ల సబ్‌ష్టేషన్ విద్యుత్‌శాఖ షిప్టు ఆపరేటర్ విద్యుత్‌ను పునరుద్ధరించాడు.
దీంతో అప్పలరాములు షాక్‌కు గురై తలకు తీవ్ర గాయమై రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య అప్పలకొండ, కుమారుడు బంగారయ్య వున్నారు. అప్పలరాములు భార్య అప్పలకొండ నిండు గర్భిణి. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలముకొంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న అప్పలరాములు అనుకోని విధంగా విద్యుత్ ప్రమాదంలో మృతి చెందడంతో రోదనలు మిన్నంటాయి. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. పూసపాటిరేగ ఎస్‌ఐ జి.కళాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.