చిట్స్‌ కార్యాలయంలో కానిస్టేబుల్‌ వీరంగం

Constable Hulchul In Chit Fund Company - Sakshi

రాజంపేట: రాజంపేట పట్టణం ప్రధాన రహదారిలో ఉన్న విజయ్‌ప్రగతి చిట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కార్యాలయంలో కడపకు చెందిన కానిస్టేబుల్‌ రామ్మోహన్‌రెడ్డి వీరంగం సృష్టించాడు. బుధవారం సాయంత్రం జరిగిన సంఘటనపై సంస్థ యాజమాన్యం తరపున ఫోర్‌మెన్‌ యల్లటూరు శివకుమార్‌రాజు పట్టణ పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేశారు. రాజంపేట పట్టణంలో విజయ్‌ ప్రగతి చిట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ను 2013లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు ఎండీగా గిరిరాజు వ్యవహరించారు. చిట్‌ బిజినెస్‌ కొనసాగిస్తున్న క్రమంలో కడపకు చెందిన కానిస్టేబుల్‌ రామ్మోహన్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డికి చిట్‌కు సంబంధించిన రూ.3లక్షలు రావాల్సి ఉంది. అందులో రూ.1.50 లక్షకు చెక్కులు ఇచ్చారు.

ఆ చెక్కులు బౌన్స్‌ కావడంతో తన అన్నకు రావాల్సిన డబ్బు రాలేదని  రామ్మోహనరెడ్డి చిట్‌ కార్యాలయంపై దాడి చేశాడు. కార్యాలయంలోని కంప్యూటర్‌తో ఫర్నిచర్,ఇతర సామాగ్రిని, అద్దాలను ధ్వంసం చేశాడు. వాటిని కార్యాలయం బయటికి తీసుకొచ్చి ఆటోను పిలిపించి వాటిలో ఎక్కించే ప్రయత్నం చేశాడు. జనం భారీగా గుమికూడి అతన్ని ప్రశ్నించేసరికి అక్కడి నుంచి కానిస్టేబుల్‌ పారిపోయాడు. జరిగిన సంఘటనపై సంస్థ ఫోర్‌మెన్‌ శివకుమార్‌రాజు, డైరెక్టర్‌ మౌలాలిలు పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా గత కొంతకాలంగా ఈ సంస్థ చిట్స్‌ మొత్తం చెల్లింపులో జాప్యం ఏర్పడటంతో పలువురు తమకు రావాల్సిన మొత్తాలను చెల్లించాలని కోరుతున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top