పరిగిలో ఘరానా మోసం | Chit Fund Home Needs Fraud in Vikarabad District | Sakshi
Sakshi News home page

హోంనీడ్స్ పేరుతో ఘరానా మోసం

Dec 3 2019 3:59 PM | Updated on Dec 3 2019 4:05 PM

Chit Fund Home Needs Fraud in Vikarabad District - Sakshi

సాక్షి, వికారాబాద్‌: అతి తక్కువ ధరలకే హోంనీడ్స్ ఇస్తామని చెప్పి ఘరానమోసం చేసిన ఘటన జిల్లాలోని పరిగిలో చోటుచేసుకుంది. హోంనీడ్స్‌ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసగాళ్లు రాత్రికిరాత్రే బిచాణా ఎత్తేశారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన వ్యక్తులు పరిగిలో హోంనీడ్స్ ఇచ్చే పేరుతో ‘రోజా ట్రేడర్స్’ను నిర్వస్తున్నారు. వస్తువు విలువలో సగం డబ్బులు చెల్లించి.. వారం రోజుల తర్వాత తీసుకుంటే సగం ధరకే ఆ వస్తువులు ఇస్తామని మోసగాళ్లు నమ్మబలికారు. దీంతో వారి మాటలు నమ్మి వినియోగదారులు వేల రూపాయలు చెల్లించారు. వినియోగదారులు చెల్లించిన డబ్బులను తీసుకున్న రోజా ట్రేడర్స్ యాజమాన్యం రాత్రికిరాత్రే పరారైంది. ఈ విషయం తెలుసుకున్న బాధితులు స్థానిక పరిగి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తామని తెలిపారు. బాధితులు దాదాపు రూ.కోటి వరకు మోస పోయినట్లు అనుమానం వ్యక్తం అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement