
సాక్షి, పశ్చిమగోదావరి: చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాతపై ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు పెట్టారని వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుడు సురేష్‌పై చింతలపూడి స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి సురేశ్‌ని అరెస్ట్ చేసినట్టు తన కుంటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే చింతలపూడి పోలీసులు సురేశ్‌ని అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. దీంతో అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు అక్రమంగా వ్యవహరిస్తున్నారంటూ అరోపణలు చేస్తున్నారు.