విమానం టాయిలెట్‌లో బంగారం పట్టివేత 

Capture gold in plane toilet - Sakshi

1,866 గ్రాములు స్వాధీనం

శంషాబాద్‌: కస్టమ్స్‌ తనిఖీలకు భయపడిన ఓ ప్రయాణికుడు తాను పట్టుబడుతానేమోననే ఆందోళనతో విదేశాల నుంచి తీసుకొచ్చిన బంగారాన్ని శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టాయిలెట్‌లో వదిలివెళ్లాడు. ఆదివారం  వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.  1,866 గ్రాముల బరువు కలిగిన పదహారు బంగారు బిస్కెట్లు ఇందులో బయటపడ్డాయి. వీటి విలువ రూ.60,94,122 ఉంటుందని అధికారులు నిర్ధారించారు. అయితే, విమానం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం తెలియరాలేదు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top