ప్రేమ దాహానికి బాలిక బలి.. | boy attacks  girl, today girl was died in chennai hospital | Sakshi
Sakshi News home page

మృత్యువుతో పోరాడి ఓడిన బాలిక..

Feb 27 2018 8:45 PM | Updated on Jul 12 2019 3:02 PM

boy attacks  girl, today girl was died in chennai hospital - Sakshi

సాక్షి, చెన్నై: ప్రేమ వేధింపులకు మరో బాలిక బలైంది. తన ప్రేమను తిరష్కరించిందని ఓ యువకుడు కిరాతకుడిగా మారాడు. కోపంతో ఆ బాలికపై పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. తీవ్రంగా గాయపడిన బాలిక 11 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ మంగళవారం తనువు చాలించింది. ఈ ఘటన చెన్నైలోని మదురై జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాలివి.. మదురై జిల్లా తిరుమంగలంలోని నడువకోట్టకు చెందిన మణిపాండి, పేచ్చియమ్మాళ్‌ దంపతుల కుమార్తె చిత్రాదేవి(15). తిరుమంగళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. గత కొద్ది రోజులుగా ఆ బాలికను బాలమురుగన్‌‌(25)  వేదిస్తున్నాడు. ఈ నెల(ఫిబ్రవరి) 16న సాయంత్రం స్కూల్‌ నుంచి తన స్నేహితురాళ్లతో కలిసి చిత్రాదేవి ఇంటికి వస్తోంది. ఆ సమయంలో బాలమురుగన్ తన స్నేహితులతో వచ్చి యువతిని అడ్డుకున్నాడు. చిత్రాదేవి మెడపై కత్తిపెట్టి నిలువరించాడు. ఆ తర్వాత పెట్రోల్‌ పోసి తగుటబెట్టి పారిపోయాడు.

కేసు విచారణ చేపట్టిన పోలీసులు బాలమురుగన్ను అరెస్టు చేశారు. దాదాపు 80 శాతం కాలిన గాయాలతో మదురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిత్రాదేవి మంగళవారం తెల్లవారుజామున కన్ను మూసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement