గుప్తనిధుల కోసం నరబలికి యత్నం | Attempted Human Sacrifice In Peddapalli Dist | Sakshi
Sakshi News home page

గుప్తనిధుల కోసం నరబలికి యత్నం

Mar 4 2018 2:48 PM | Updated on Mar 4 2018 2:48 PM

Attempted Human Sacrifice In Peddapalli Dist - Sakshi

పెద్దపల్లి : గుప్త నిధుల కోసం కొందరు కిరాతకులు నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం మొట్లపల్లి సమీపంలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..

మొట్టుపల్లి సమీపంలోని సుంకరికోట వద్ద కొందరు గుప్త నిధుల కోసం క్షుద్రపూజలు చేసి, గజ్జర్ల రమేశ్‌ అనే యువకుడిని బలిచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, ముఠా కళ్లుగప్పి అక్కడి నుంచి తప్పించుకున్న బాధితుడు తన కుటుంబీకులకు సమాచారమిచ్చాడు. స్థానికులంతా కలిసి గుప్త నిధుల ముఠా సభ్యులను పట్టుకుని, దేహశుద్ధిచేసి, పోలీసులకు అప్పగించారు. బాధితుడు రమేశ్‌ది కిష్టంపేట అని, ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement