ప్రేమజంటపై దుండగుల అఘాయిత్యం | Attack on Lovers in Karnataka | Sakshi
Sakshi News home page

ప్రేమజంటపై దుండగుల అఘాయిత్యం

Mar 7 2019 11:40 AM | Updated on Mar 7 2019 11:40 AM

Attack on Lovers in Karnataka - Sakshi

యువతిని వివస్త్రను చేసి వీడియో  కెంగేరి రైల్వేస్టేషన్‌ వద్ద ఘటన  

కర్ణాటక, యశవంతపుర: ప్రేమికులను బెదిరించి డబ్బులు, బంగారు నగలను దోచుకెళ్లడంతో పాటు  యువతిని వివస్త్రను చేసి వీడియో తీసిన ఘటన ఘటన కెంగేరి పోలీసుస్టేషన్‌ పరిధిలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆమె ప్రియుడైన క్యాబ్‌ డ్రైవర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ఊరికి పంపాలని వస్తే..  
 వివరాలు.. క్యాబ్‌ డ్రైవర్, ఒక యువతి ప్రేమలో ఉన్నారు. తనను కలవడానికి వచ్చిన యువతిని ఆదివారం సాయంత్రం ఊరికు పంపడానికి కారులో కెంగేరి రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే రైలు వెళ్లిపోవటంతో సోమవారం తెల్లవారుజామున మరో రైలు ఉండగా అందులో పంపాలని అక్కడే ఉన్నాడు. కాలక్షేపం కోసం రైల్వే గేటు పక్కలో కారు కూర్చుని మాట్లాడుతూ ఉండగా నలుగురు దుండగులు వచ్చారు. చాకుతో బెదిరించి డబ్బు, బంగారు నగలు లాక్కున్నారు. చాకును యువతి గొంతుపై పెట్టి డబ్బులు, బంగారం ఇవ్వకుంటే ఆమెను చంపుతామంటూ బెదిరించారు.

దీనితో ప్రియుడు తన ఎటీఎం కార్డును దుండగులకు ఇచ్చాడు. వారు సమీపంలోని ఎటీఎం కేంద్రానికి వెళ్లిన రూ. 25 వేలు నగదు డ్రా చేసుకున్నారు. ప్రియుని ముందే ప్రియురాలిని వివస్త్రను చేసి మొబైల్‌ఫోన్లో వీడియో తీశారు. దోపిడి విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను వాట్సప్, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తామని భయపెట్టారు.   దీనితో ఒక రోజంతా మౌనంగా ఉండిపోయారు. డ్రైవర్‌ చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు బాధిత యువతిని స్టేషన్‌కు పిలిపించి వివరాలను సేకరించారు. రాత్రి సమయంలో జనసంచారం లేకపోవడంతో దుండగులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. ఈ మార్గంలో అమర్చిన సీసీ కేమరా రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగుల కోసం గాలిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement