‘శ్రీగౌతమి’ నిందితులకు జైల్లో రాజభోగాలు

All Facilities For Sri Gowthami Accused In Jail Says Her Sister - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : శ్రీగౌతమి హత్య కేసు నిందితులకు జైలులో సకల సౌకర్యాలు అందిస్తున్నారని ఆమె సోదరి పావని ఆరోపించింది. శ్రీగౌతమి హత్య కేసులో అరెస్టయిన టీడీపీ నేతలు సజ్జా బుజ్జి, జడ్పీటీసీ బాలాం ప్రతాప్‌లకు నరసాపురం సబ్‌ జైలులో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆమె జైలు శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం పావని ఫిర్యాదు మేరకు అధికారులు జైలులో తనిఖీలు చేపట్టారు. జైలు శాఖ డీఎస్పీ మారుతి రమేష్‌ దాదాపు రెండు గంటల నుంచి జైలులోని సిబ్బందిని విచారించారు. విచారణ అనంతరం డీఐజీకి నివేదిక సమర్పిస్తామని ఆయన తెలిపారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top