ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి | Accidental Death of a Person Vempalle in Ysr District | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

Jun 25 2019 8:04 AM | Updated on Jun 25 2019 8:06 AM

Accidental Death of a Person Vempalle in Ysr District - Sakshi

సాక్షి, వేంపల్లె(కడప) : మండలంలోని గిడ్డంగివారిపల్లె గ్రామంలో ప్రమాదవశాత్తు వెంకటశివారెడ్డి(38) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాత్రి వెంకటశివారెడ్డి మిద్దెపైన నిద్రపోయారు. వ్యవసాయ పనుల నిమిత్తం తెల్లవారుజామున నిద్రలేచి కిందకు దిగుతుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. దీంతో తలకు బలమైన గాయాలయ్యాయి. వేంపల్లె ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం కడప రిమ్స్‌కు తరలించారు.

మెరుగైన వైద్యం కోసం తిరుపతికి వెళ్లాలని డాక్టర్లు సూచించగా.. మార్గ మధ్యంలోనే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. కాగా, ఇటీవల రెండు నెలల క్రితం భార్య రమాదేవి క్యాన్సర్‌ వ్యాధితో మృతి చెందింది. ఇతనికి ఇద్దరు కుమారులు ప్రకాష్‌రెడ్డి, హేమంత్‌రెడ్డిలు కాగా.. పెద్ద కుమారుడు ప్రకాష్‌రెడ్డి తోటలో పాము కాటుతో గతంలోనే మృతి చెందాడని బంధువులు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో హేమంత్‌రెడ్డి ఒక్కడే ఉండటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుమకున్నాయి. పోస్టుమార్టం కోసం వెంకటశివారెడ్డి మృతదేహాన్ని వేంపల్లె ప్రభుత్వాసుపత్రిలో ఉంచారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement