ఒక యాక్టివా.. 72 చలానాలు | 72 Pending Challans on Activa Scooty in Hyderabad | Sakshi
Sakshi News home page

ఒక యాక్టివా.. 72 చలానాలు

Jan 23 2020 8:07 AM | Updated on Jan 23 2020 8:07 AM

72 Pending Challans on Activa Scooty in Hyderabad - Sakshi

పెండింగ్‌ చలానాల రసీదును చూపిస్తున్న ఎస్‌ఐ రమేశ్‌

నల్లకుంట: సుమారు 72 పెండింగ్‌ చలానాలు ఉన్న ఓ యాక్టివా ద్విచక్ర వాహనం నల్లకుంట ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కింది. ఎస్‌ఐ రమేశ్‌  వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రి సిగ్నల్స్‌ వద్ద నల్లకుంట ట్రాఫిక్‌ పోలీసులు పెండింగ్‌ చలానాలపై స్పెషల్‌ డ్రైవ్‌ చేట్టారు. అదే సమయంలో అంబర్‌పేటకు చెందిన సురేశ్‌ అనే వ్యక్తి యాక్టివా (టీఎస్‌11 ఈజే 7202) ద్విచక్ర వాహనంపై అటుగా వచ్చాడు. అనుమానంతో ఆ వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా 72 పెండింగ్‌ చలానాలు (రూ. 9,750) ఉన్నాయి. దీంతో వాహనాన్ని సీజ్‌ చేసిన ట్రాఫిక్‌ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement