పెండింగ్ చలాన్లు.. వాహనం సీజ్‌.. హైకోర్టు ఆగ్రహం | High Court issues notice to DGP over pending challans | Sakshi
Sakshi News home page

పెండింగ్ చలాన్లు.. వాహనం సీజ్‌.. హైకోర్టు ఆగ్రహం

May 1 2026 4:39 PM | Updated on May 1 2026 5:27 PM

High Court issues notice to DGP over pending challans

సాక్షి, హైదరాబాద్:పెండింగ్‌ చలాన్ల విషయంలో రాష్ట్ర హైకోర్టు డీజీపీ, మాజీ డీజీపీ, ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీలకు నోటీసులు అందజేసింది. ట్రాఫిక్‌ చలాన్లు ఉంటే వాహనాలను సీజ్‌ చేయెుద్దని గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటీకీ ట్రాఫిక్‌ పోలీసులు సదరు వ్యక్తికి చెందిన వాహనాన్ని సీజ్‌ చేశారు. దీంతో సదరు వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు డీజీపీతో పాటు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.  

అయితే గతంలో హైకోర్టులో ఈ విషయమై విచారణ జరిగింది. వాహనదారులు చలాన్‌లు చెల్లించాలని బైక్ కీస్ లాక్కోవడం, వాహనాన్ని ఆపేయడం వంటివి చేయవద్దని. వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్‌లు చెల్లిస్తే పోలీసులు వసూలు చేసుకోవచ్చు. అంతేకానీ.. పెండింగ్ చలాన్‌లను చెల్లించమని బలవంతపెట్టొద్దు అని అధికారులని కోర్టు ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement