దారుణం: వివాహితపై అత్యాచారం, ఆపై హత్య | 30 Year Old Woman Killed By Unidentified Men In Komaram Bheem District | Sakshi
Sakshi News home page

దారుణం: వివాహితపై అత్యాచారం, ఆపై హత్య

Nov 25 2019 7:24 PM | Updated on Nov 25 2019 7:43 PM

30 Year Old Woman Killed By Unidentified Men In Komaram Bheem District - Sakshi

సాక్షి, కొమురం భీం (ఆసిఫాబాద్) : జిల్లాలో దారుణం జరిగింది. గ్రామ గ్రామానా తిరుగుతూ బుగ్గలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని దుండగులు. ఈ ఘటన లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌ గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్‌ మండలం గొసంపెల్లి గ్రామానికి చెందిన లక్ష్మి గ్రామ గ్రామానికి తిరుగుతూ బుగ్గలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. సోమవారం ఎల్లాపటార్‌కు వెళ్లిన లక్ష్మిని కొంతమంది గుర్తుతెలియన దుండగులు అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అత్యంత దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisement
 
Advertisement
Advertisement