ఊయలే ఉరితాడై.. | 13 Years Old Girl Dies While Playing Hammock In Kurnool | Sakshi
Sakshi News home page

ఊయలే ఉరితాడై..

Jun 2 2019 10:50 AM | Updated on Jun 2 2019 10:51 AM

13 Years Old Girl Dies While Playing Hammock In Kurnool - Sakshi

పాణ్యం: ఊయలే ఉరితాడైంది..ఓ బాలిక ప్రాణాలు తీసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా పాణ్యంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పాణ్యం గ్రామానికి చెందిన అబిబా, మాబాషాలకు కుమారుడు, కుమార్తె సంతానం. రోజులాగే తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. ఇంటి వద్ద ఉన్న కుమార్తె సునయన (13) చెట్టుకు ఊయల వేసుకొని ఆడుకుంటూ ఉంది. ఊయలలో కూర్చుని తాడును పురితిప్పగా అది తిరిగి అతి వేగంగా వ్యతిరేక దిశలో మెలితిరిగి.. ఒక్కసారిగా సునయన మెడకు బిగుసుకుంది.

గమనించిన స్థానికులు, బంధువులు హుటాహుటిన నంద్యాల సమీపంలోని శాంతిరాం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూలు పెద్దాస్పత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందింది. సునయన స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉంటోంది. కేసు నమోదు చేసినట్లు పాణ్యం హెడ్‌ కానిస్టేబుల్‌ కృష్ణమూర్తి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement