ఒక్క నెలలోనే  యస్‌ బ్యాంకు రికార్డు లాభం

YES Bank share price clocks worlds biggest gain in one month, rises 78percent - Sakshi

సాక్షి, ముంబై : వరుస వివాదాలతో భారీ నష్టాల్లో కూరుకుపోయిన ప్రయివేటు బ్యాంకు యస్‌ బ్యాంకు  రికార్డు స్తాయి లాభాలతో దూసుకుపోతోంది. రుణాల సేకరణ  ప్రయత్నాలు ఒక కొలిక్కి రానుండటంతో పాటు, రాకేష్‌ ఝన్‌ఝన్‌ వాలా షేర్ల కొనుగోలు పరిణామాల నేపథ్యంలో యస్‌ బ్యాంక్ షేర్లు  ఒక నెలలో 78 శాతానికిపైగా పుంజుకున్నాయి. దీంతో  ఒక బిలియన్‌ డాలర్లకు పైగా ఎక్కువ విలువైన కంపెనీల వరుసలో చేరింది.  ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లాభంగా నిలవడం విశేషం. 

గత ఏడాదిలో 68 శాతం కోల్పోగా, ఈ సంవత్సరం ప్రారంభంనుంచి  61శాతం పడిపోయి, సెప్టెంబర్ 2019 చివరలో, వ్యవస్థాపకుడు రానా కపూర్‌, ఇతర ప్రమోటర్ల వాటాల విక్రయంతో 2019లో అతిచెత్త ప్రదర‍్శన  కనబర్చిన కంపెనీగా  దిగజారిపోయింది. అయితే ఇటీవల నిధుల సేకరణకు బ్యాంకు యాజమాన్యం ప్రయత్నాలుముమ్మరంలో చేయడంతో  ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది. దీనికి తోడు ప్రముఖ పెట్టుబడిదారుడు  నవంబరు 5వ తేదీన రాకేష్‌ ఝన్‌ ఝన్‌వాలా రూ. 87కోట్ల విలువైన 1.3 కోట్ల  షేర్లను కొనుగోలు చేయడం మరింత సానుకూలంగా మారింది. దీంతో వరుస సెషన్లుగా లాభపడుతూ వచ్చిన యస్‌ బ్యాంకు షేరు సోమవారం నాటి ట్రేడింగ్‌లో మరో 5 శాతం ఎగిసి రూ.72.90వద్ద ముగిసింది. ఇంట్రాడేలో  రూ. 71.35 గరిష్టాన్ని తాకింది. అక్టోబర్ 1 న, యస్‌ బ్యాంక్ షేర్ ధర 23 శాతానికి పైగా పడిపోయి రూ. 29 వద్ద  52 వారాల కనిష్టానికి చేరిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top