రెడ్‌ కలర్‌లో రెడ్‌మి నోట్‌ 5 ప్రొ

Xiaomi Unveils New Redmi Note 5 Pro Variant In Red Colour - Sakshi

రెడ్‌మి నోట్‌ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ ఇన్ని రోజులు లేక్‌ బ్లూ, బ్లాక్‌, గోల్డ్‌, రోజ్‌ గోల్డ్‌ రంగుల్లోనే అందుబాటులో ఉండేది. తాజాగా మరో కలర్‌ వేరియంట్‌ కూడా కస్టమర్ల ముందుకు వచ్చింది. రెడ్‌మి నోట్‌ 5 ప్రొ ​రెడ్‌ కలర్‌ వేరియంట్‌ను షావోమి లాంచ్‌ చేసింది. దీంతో మొత్తంగా ఐదు రంగుల్లో రెడ్‌మి నోట్‌ 5 ప్రొ లభ్యమవుతుంది. ఈ డివైజ్‌ ప్రస్తుతం షావోమి అధికారిక సైట్‌లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈ ఫోన్‌ త్వరలోనే లభ్యం కానుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రెడ్‌మి నోట్‌ 5 ప్రొ లాంచ్‌ అయింది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 636 చిప్‌సెట్‌ ఫీచర్‌తో వచ్చిన తొలి డివైజ్‌ ఇదే. 

షావోమి లాంచ్‌ చేసిన రెడ్‌మి నోట్‌ 5 ప్రొ.. 6జీబీ ర్యామ్‌ను కలిగి ఉంది. 6జీబీ ర్యామ్‌తో వచ్చిన తొలి నోట్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇదే కావడం విశేషం.  4జీబీ ర్యామ్‌+64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 6జీబీ ర్యామ్‌+64జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో దీన్ని లాంచ్‌ చేసింది షావోమి. వీటి ధరలు రూ.14,999గా, రూ.16,999గా ఉన్నాయి. ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ను కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌తో షావోమి తన యూజర్లకు ప్రవేశపెట్టింది. 20 మెగాపిక్సెల్‌తో సెల్ఫీ షూటర్‌ కలిగి ఉండగా.. వెనుకవైపు 12 మెగాపిక్సెల్‌, 5 మెగాపిక్సెల్‌ సెన్సార్లతో డ్యూయల్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top