అద్భుత ఫీచర్లతో రెడ్‌మి నోట్‌ 7 లాంచ్‌

Xiaomi Redmi Note 7 launched in China - Sakshi

బీజింగ్‌ : షావోమి రెడ్‌ మి నోట్‌ సిరీస్‌లో మరో కొత్త డివైస్‌ను గురువారం విడుదలచేసింది. చైనా రాజధాని బీజింగ్‌లో నిర్వహించిన ఒక ఈవెంట్‌లో రెడ్‌ మి నోట్‌ 7ను లాంచ్‌ చేసింది.  అంతేకాదు  డిఫరెంట్‌ డిజైన్‌, డ్యూడ్రాప్‌ న్యాచ్‌తో షావోమి  తొలి స్మార్ట్‌ఫోన్‌గా  రెడ్‌మి నోట్‌ 7 నిలవనుంది.  మూడు వేరియంట్లలో, బడ్జెట్‌ ధరల్లో వీటిని ఆవిష్కరించింది.  దీంతోపాటు రెడ్‌మి నోట్‌ 7ప్రొను కూడా తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో  ఒక్క కెమెరా తప్ప మిగిలిన ఫీచర్లన్నీ ఒకేలా ఉన్నాయి.
చైనా మార్కెట్‌లో వీటి ధరలు మన కరెన్సీ ప్రకారం సుమారుగా   ఇలా ఉన్నాయి.
 

3జీబీ ర్యామ్‌/ 32జీబీ స్టోరేజ్‌ ధర : 10వేల రూపాయలు
4జీబీ ర్యామ్‌/ 64జీబీ స్టోరేజ్‌ ధర :  రూ.12,500 
6జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌ ధర :  రూ.14, 500

స్పెసిఫికేషన్స్‌
6.3 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే
2340x1080 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
స్నాప్‌డ్రాగన్‌ 660 సాక్‌
48+5 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా(ఏఐ ఆధారిత)
13ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top