ఓపెన్‌ సేల్‌లో రెడ్‌మి నోట్‌ 5 ప్రొ

Xiaomi Redmi Note 5 Pro Open Sales Begin In India - Sakshi

షావోమి పాపులర్‌ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి నోట్‌ 5 ప్రొ ఎట్టకేలకు ఓపెన్‌ సేల్‌కు వచ్చింది. 24 గంటల పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులో ఉంచనున్నట్టు కంపెనీ వెల్లడించింది. దీంతో ఆరు నెలల పాటు కొనసాగిన రెడ్‌మి నోట్‌ 5 ప్రొ ఫ్లాష్‌ సేల్స్‌కు తెరపడింది. ప్రతి వారం నిర్వహించే ఫ్లాష్‌సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలుకు ఇబ్బందులు పడే కస్టమర్లు... ఇకపై ఎప్పుడైనా ఈ స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.  ఫ్లాష్ సేల్ కి రాగానే నిమిషాల వ్యవధిలో ఈ ఫోన్ సేల్ అయిపోయి అవుట్ ఆఫ్ స్టాక్ అనే బోర్డులు దర్శనమిస్తుండటంతో కంపెనీ ఈ రకమైన నిర్ణయం తీసుకుంది.

షావోమి అధికారిక వెబ్‌సైట్‌ ఎంఐ.కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉండనుంది. బ్లాక్‌, బ్లూ, గోల్డ్‌, రోజ్‌ గోల్డ్‌ రంగుల్లో రెడ్‌మి నోట్‌ 5 ప్రొ మార్కెట్‌లోకి వచ్చింది. రెడ్‌మి నోట్ 5 ప్రొ బేస్‌ వేరియంట్‌ ధర రూ.14,999కాగ, హై-ఎండ్‌ వెర్షన్‌ ధర రూ16,999గా ఉంది. రెడ్‌మి నోట్‌ 5 ప్రొ లాంచ్‌ ఆఫర్లుగా 2,200 రూపాయల క్యాష్‌బ్యాక్‌, 4.5టీబీ అదనపు డేటాను జియో ఆఫర్‌ చేస్తోంది. 3 నెలల హంగామా మ్యూజిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా లభించనుంది. యాక్సిస్‌ బ్యాంక్‌ బుజ్‌ క్రెడిట్‌ కార్డుల కొనుగోళ్లపై 5 శాతం డిస్కౌంట్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది.

రెడ్‌మి నోట్‌ 5 ప్రొ ఫీచర్లు...
5.99 అంగుళాల ఫుల్‌ హెచ్డీ డిస్‌ప్లే
2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్
4/6 జీబీ ర్యామ్ 
64 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
 ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top