షావోమి ‘మి మిక్స్‌ 2’@ రూ.35,999 | Sakshi
Sakshi News home page

షావోమి ‘మి మిక్స్‌ 2’@ రూ.35,999

Published Wed, Oct 11 2017 1:02 AM

Xiaomi enters premium segment with the launch of Mi MIX 2

న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా ‘మి మిక్స్‌ 2’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.35,999గా ఉంది. దీంతో షావోమి ఇండియాలో ప్రీమియం హ్యాండ్‌సెట్స్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టినట్లయ్యింది.

కంపెనీ దేశంలో విక్రయిస్తున్న ఫోన్లు అన్నింటిలోకెల్లా ఇదే ఖరీదైనది. ‘మి మిక్స్‌ 2’లో 5.99 అంగుళాల ఫుల్‌స్క్రీన్‌ డిస్‌ప్లే, సెరామిక్‌ బ్యాక్, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ, 12 ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 3,400 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది.

‘మి మిక్స్‌2’ను విడుదల చేస్తున్న షావోమి ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ మను జైన్, ప్రొడక్ట్‌ హెడ్‌ జై మణి.

Advertisement

తప్పక చదవండి

Advertisement