ఫిబ్రవరి 21న బ్యాంకు సీఈవోలతో భేటీ

Will MeetBank Heads on Feb 21 onTransmission of Rate Cut: Shaktikanta Das - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల అధిపతులతో త్వరలోనే సమావేశం కానున్నామని  రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా గవర్నరు శక్తికాంత దాస్‌ వెల్లడించారు. ఆర్‌బీఐ కీలక వడ్డీరేటు తగ్గింపు, ఈ ప్రయోజనాలను వినియోగాదారులకు అందించే విధంగావారితో చర్చించ నున్నామని సోమవారం నిర్వహించిన మీడియాలో సమావేశంలో  ప్రకటించారు. ఫిబ్రవరి 21న ప్రభుత్వ, ప్రయివేటు సీఈవోలతో భేటి కానున్నట్టు చెప్పారు.

అంతకుముందు ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలను తిరిగి చేపట్టిన  అరుణ్ జైట్లీ ఆర్‌బీఐ బోర్డునుద్దేశించి ప్రసంగించారు. ద్రవ్య విధాన నిర్ణయాలను  బ్యాంకు ఖాతాదారులకు బదిలీ చేయడం ముఖ్యమని జైట్లీ వ్యాఖ్యానించారు. బ్యాంకింగ్ రంగంలో విలీనంపై వ్యాఖ్యానిస్తూ  మెగా బ్యాంకులు భారత ఆర్థిక వ్యవస్థకు  అవసరమని  నొక్కి చెప్పారు. కాగా గవర్నరుగా శక్తి కాంత దాస్‌ నేతృత్వంలోని  మానిటరీ పాలసి కమిటీ తొలిసారిగా ఈ నెలలో ప్రకటించిన పాలసీ రివ్యూలో కీలక వడ్డీరేట్లను 0.25శాతం తగ్గించిన  సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top