అమెరికా ‘ఫెడ్’ రేటు యథాతథం | What to expect from the Fed's first meeting since 'Brexit' | Sakshi
Sakshi News home page

అమెరికా ‘ఫెడ్’ రేటు యథాతథం

Jul 28 2016 12:43 AM | Updated on Oct 1 2018 5:32 PM

అమెరికా ‘ఫెడ్’ రేటు యథాతథం - Sakshi

అమెరికా ‘ఫెడ్’ రేటు యథాతథం

అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడ్ ఫండ్ రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయిం చింది. ప్రస్తుతం ఈ రేటు 0.25- 0.50 శాతం శ్రేణిలో ఉంది.

న్యూయార్క్ : అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడ్ ఫండ్ రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయిం చింది. ప్రస్తుతం ఈ రేటు 0.25- 0.50 శాతం శ్రేణిలో ఉంది. ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు తొలగిపోతున్నాయని బుధవారం రాత్రి కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఫెడ్ వ్యాఖ్యానించడం గమనార్హం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నదంటూ ఫెడ్ పేర్కొన్న నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే వడ్డీ రేట్ల పెంపు వుండవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి.

బ్రెగ్జిట్ కారణంగా వడ్డీ రేట్ల పెంపుపై ఆచితూచి వ్యవహరిస్తామంటూ ఫెడ్ అధికారులు ఇప్పటివరకూ చెపుతూవస్తున్నారు. దాంతో  డిసెం బర్‌లో మాత్రమే ఫెడ్ రేటు పెరిగే అవకాశం 40 శాతం వరకూ వుందని ఆర్థికవేత్తలు అంచనావేస్తువచ్చారు. ఫెడ్ తాజా అభిప్రాయంతో సెప్టెం బర్ లేదా డిసెంబర్‌లో రేటు పెంపు తప్పదన్నది తాజా అంచనాలు. శుక్రవారం అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రెండవ త్రైమాసిక ఫలితాలు (ఏప్రిల్-జూన్) వెలువడుతుండడమూ తాజా ఫెడ్ నిర్ణయానికి నేపథ్యం. క్యూ1లో ఈ రేటు 1.1 శాతం కాగా, క్యూ2లో 2 శానికి కొంచెం పైనే ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement