ఆయన జీతం.. రూ. 74 కోట్లు! | Vishal Sikka kicks in big salary spikes at Infosys | Sakshi
Sakshi News home page

ఆయన జీతం.. రూ. 74 కోట్లు!

May 16 2016 2:17 PM | Updated on Sep 4 2017 12:14 AM

ఆయన జీతం.. రూ. 74 కోట్లు!

ఆయన జీతం.. రూ. 74 కోట్లు!

ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా జీతం భారీగా పెరిగింది. తాజాగా ఇన్ఫోసిస్ విడుదల చేసిన ఫలితాల్లో కంపెనీ మంచి లాభాలు ఆర్జించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

బెంగళూరు: ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా జీతం భారీగా పెరిగింది. తాజాగా ఇన్ఫోసిస్ విడుదల చేసిన ఫలితాల్లో కంపెనీ మంచి లాభాలు ఆర్జించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఏడాదికి ఆయన దాదాపు 74 కోట్ల రూపాయలను జీతభత్యాలుగా అందుకోనున్నారు.

2016 ఆర్థిక సంవత్సరంలో సిక్కా ఇన్ఫోసిస్ ఆదాయాన్ని 63,446 కోట్ల రూపాయలకు చేర్చారు. అక్కడితో ఆగిపోకుండా నాస్ కామ్ అంచనాలను తలక్రిందులు చేస్తూ 13.3 శాతం వృద్ధిని కూడా నమోదు చేసింది. దీంతో కంపెనీ సీఈవోగా సిక్కా పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పెంచింది. అంటే 2021 వరకు సిక్కానే ఇన్ఫోసిస్ సీఈవోగా కొనసాగనున్నారు. సిక్కా పే స్కేల్లో మార్పులతో కంపెనీ సీనియర్ల జీతభత్యాల్లో కూడా మార్పులు రానున్నాయి. అయితే, మిగతా ఉద్యోగుల జీతాలను కంపెనీ వెల్లడించలేదు. రెండేళ్ల క్రితం ఇన్ఫోసిస్ భారీ నష్టాలను చవిచూసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement