ఏంజెల్‌ బ్రోకింగ్‌ బ్రోకరేజ్‌ నుంచి 2స్టాక్‌ రికమెండేషన్లు | Vinati Organics, Kajaria Ceramics can give up to 10% return in short term | Sakshi
Sakshi News home page

ఏంజెల్‌ బ్రోకింగ్‌ బ్రోకరేజ్‌ నుంచి 2స్టాక్‌ రికమెండేషన్లు

Jun 1 2020 12:55 PM | Updated on Jun 1 2020 2:02 PM

 Vinati Organics, Kajaria Ceramics can give up to 10% return in short term - Sakshi

షేరు పేరు: వినతి ఆర్గానిక్స్‌ 
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.1,095
స్టాప్‌ లాస్‌: రూ.976
అప్‌సైడ్‌: 7శాతం

విశ్లేషణ: లాక్‌డౌన్‌తో కొద్దిరోజుల పాటు ఒడిదుడుకులను ఎదుర్కోన్న కెమికల్‌ రంగం ప్రస్తుతం గాడిలో పడింది. ఈ స్టాక్‌ విషయానికొస్తే.., మార్చి నెలలో భారీ పతనం తర్వాత, రూ.700 స్థాయిల నుండి అద్భుతమైన రికవరీని సాధించింది. ఇటీవల, స్టాక్ ధర దాని 200 రోజుల సింపుల్‌ మూవింగ్‌ యావరేజ్‌ చుట్టూ దాదాపు  3వారాల పాటు కన్సాలిడేట్‌ అయ్యింది. అయితే చివరి శుక్రవారం, బలమైన కొనుగోళ్లతో మరో మద్దుతు స్థాయికి అధిగమించేందుకు ప్రయత్నం చేసింది.

షేరు పేరు: కజారియా సిరామిక్స్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.378 
స్టాప్‌ లాస్‌: రూ.316
అప్‌సైడ్‌: 10శాతం
విశ్లేషణ: షేరు జనవరి గరిష్టం నుంచి దాదాపు 50శాతం కరెక‌్షన్‌కు లోనవడంతో, ఈ కౌంటర్‌ గత 4నెలలుగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోంటుంది. చివరి వారంలో కొన్నేళ్ల మద్దతు స్థాయిల వద్ద ఆగిపోయింది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో, స్టాక్ ధరల బలమైన పెరుగుదలను చూసింది. ఇప్పుడు డైలీ ఛార్ట్‌ను పరిశీలిస్తే.., షేరు గడిచిన 3నెలల తర్వాత మొదటిసారి 20 రోజుల ఎక్స్‌పోన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌పై ముగిసినట్లు స్పష్టమవుతోంది. అదనంగా, బలమైన మద్దతు జోన్‌ వద్ద బుల్లిష్‌ హ్యామర్‌ ప్యాట్రన్‌ నిర్ధారణను సూచిస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement